Telangana1st Oct 04:32 PMSunil Byrisetty1 min read

‘ఐబొమ్మ' వర్సెస్ పోలీస్!

కొత్త సినిమాల ప్రింట్లను పైరసీ చేసి వెబ్సైట్ లో పెట్టే ఐ బొమ్మ నిర్వాహకుడిని త్వరలోనే పట్టుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. “అతడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియట్లేదు, విదేశాల్ల

‘ఐబొమ్మ' వర్సెస్ పోలీస్!
కొత్త సినిమాల ప్రింట్లను పైరసీ చేసి వెబ్సైట్ లో పెట్టే ఐ బొమ్మ నిర్వాహకుడిని త్వరలోనే పట్టుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. “అతడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియట్లేదు, విదేశాల్లో ఉండి ఉండొచ్చు,” అని పోలీసులు చెప్పారు. అయితే 'IBOMMA' చెందిన నలుగురిని ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా వీరు దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసి అంతర్రాష్ట్ర పైరసీ ముఠాను పట్టుకున్నారు. మరోవైపు ఐ బొమ్మ సైతం పోలీసులకు ఛాలెంజ్ విసిరింది. తమను పట్టుకోలేరని, వెబ్సైట్ ను ఆపాలని చూస్తే పోలీసుల ఫోన్ నంబర్లు బయట పెడతామని మాస్ వార్నింగ్ ఇచ్చింది. తమ వద్ద 5 కోట్ల మంది డేటా ఉందని పేర్కొంది.
Telugu Cinema
Ibomma
Movie Piracy
Hyderabad Police
Piracy Website
Arrests
Inter-State Piracy Gang
Cyber Crime
Film Industry
Data Breach
Mass Warning
Law Enforcement
Scroll for the next article