Entertainment15th Nov 11:18 AMSunil Byrisetty1 min read
iBommaకు షాక్.. నిర్వాహకుడు రవి అరెస్ట్
కొత్త సినిమాలను విడుదలైన వెంటనే ఆన్లైన్లో ఉంచే iBomma ప్లాట్ ఫాం తెలిసిందే. ఇటీవల సినీ నిర్మాతల సంఘం, పోలీసులు ఐబొమ్మకు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఐబొమ్మ సైతం దీటుగా స్పందించి, ప్రకట
కొత్త సినిమాలను విడుదలైన వెంటనే ఆన్లైన్లో ఉంచే iBomma ప్లాట్ ఫాం తెలిసిందే. ఇటీవల సినీ నిర్మాతల సంఘం, పోలీసులు ఐబొమ్మకు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఐబొమ్మ సైతం దీటుగా స్పందించి, ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. నిన్న ఫ్రాన్స్ నుంచి వచ్చిన అతడిని హైదరాబాద్ కూకట్పల్లిలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి కరీబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సినిమాలను విడుదలైన రోజే పైరసీ ద్వారా వెబ్సైట్లో పెట్టడంపై నిర్మాతలు పలుమార్లు iBommaపై కంప్లైంట్లు ఇచ్చారు.