News23rd Mar 09:06 AMSunil Byrisetty1 min read
దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం.. అమరావతిలో నిర్మాణం
క్రికెట్ అంటే మనకు ఆట కాదు ఒక ఎమోషన్. అందుకే మన దేశంలో క్రికెట్‌కు అభిమానులు ఎక్కువ. దేశంలో అతి పెద్ద స్టేడియం ఇప్పటి వరకు గుజరాత్‌లో ఉండగా ఇకపై ఆంధ్రాకి ఆ ఘనత దక్కనుంది. ఆంధ్రప్రద
క్రికెట్ అంటే మనకు ఆట కాదు ఒక ఎమోషన్. అందుకే మన దేశంలో క్రికెట్‌కు అభిమానులు ఎక్కువ.
దేశంలో అతి పెద్ద స్టేడియం ఇప్పటి వరకు గుజరాత్‌లో ఉండగా ఇకపై ఆంధ్రాకి ఆ ఘనత దక్కనుంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరావతిలో స్పోర్ట్స్ సిటీని నిర్మి్స్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే ప్రకటించారు.
ఈ స్పోర్ట్స్ సిటీలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు.
అమరావతి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఐసీసీ అనుమతి కూడా ఇచ్చినట్లు సమాచారం.
విజయవాడ ఎంపీ, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్ కేశినేని శివనాథ్(చిన్ని) దీనిపై స్పష్టతనిచ్చారు.
అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి ఐసీసీ ఛైర్మన్ జైషా అనుమతి ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.
రెండు నుంచి రెండున్నర ఏళ్ల లోపే స్టేడియాన్ని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
అలాగే రాష్ట్రంలో విజయనగరం, మూలపాడులో క్రికెట్ అకాడమీలను పెడుతున్నట్లు వివరించారు.
విశాఖపట్నంలోని ఏసీఏ - వీడీసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో రెండు నెలల్లోనే మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామన్నారు.
ఐపీఎల్ తర్వాత ఎలివేషన్ పనులు కూడా పూర్తి చేస్తామన్నారు.
రాష్ట్రంలో ఏటా 30 మైదానాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కేశినేని చిన్ని వివరించారు.
దేశంలో ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్టేడియం..
దేశంలోనే అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందింది.
అయితే ఈ స్టేడియాన్ని మించేలా లక్షా 32 వేల సీటింగ్ సామర్థ్యంలో అమరావతిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అమరావతిలో 60 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఏసీఏ కోరుతోంది.