Sports9th Nov 12:41 PMSunil Byrisetty1 min read
ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్‌లో 10 జట్లు
మహిళా క్రికెట్ ప్రపంచ కప్ విషయంలో ఐసీసీ పలు నిర్ణయాలు తీసుకుంది. ఐసీసీ బోర్డు సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను మరింత విస్తరించడం, మహిళల క్రికెట్‌కు ప్రాధాన్యం పెంచడం, క్రీడ ద
మహిళా క్రికెట్ ప్రపంచ కప్ విషయంలో ఐసీసీ పలు నిర్ణయాలు తీసుకుంది. ఐసీసీ బోర్డు సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను మరింత విస్తరించడం, మహిళల క్రికెట్‌కు ప్రాధాన్యం పెంచడం, క్రీడ దీర్ఘకాలిక అభివృద్ధికి పటిష్ఠమైన ప్రణాళికలు రూపొందించడం వంటి అంశాలపై సభ్యులు చర్చించి తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు క్రికెట్ భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.
2025లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌కు అపూర్వ స్పందన లభించిందని ఐసీసీ వెల్లడించింది. ఈ టోర్నమెంట్‌ను స్టేడియాల్లో దాదాపు 3 లక్షల మంది వీక్షించారు. ఈ నేపథ్యంలో రాబోయే మహిళల వన్డే ప్రపంచకప్‌ను ప్రస్తుతం ఉన్న 8 జట్లకు బదులుగా 10 జట్లతో నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఒలింపిక్స్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో టీ20 ఫార్మాట్‌లో పోటీలు జరుగుతాయి. ఒక్కో విభాగంలో ఆరు జట్ల చొప్పున పాల్గొంటాయి. దీంతో పాటు 2026 ఆసియా క్రీడలు (జపాన్), 2027 ఆఫ్రికన్ గేమ్స్ (ఈజిప్ట్), 2027 పాన్‌అమ్ గేమ్స్ (పెరూ)లలో కూడా క్రికెట్ ఒక భాగంగా ఉండనుంది.