Business Type10th Aug 12:13 PMSunil Byrisetty1 min read

షాకిచ్చిన ఐసీఐసీఐ.. మినిమం 50 వేలు

ఐసీఐసీఐ బ్యాంక్ తమ ఖాతాదారులకు గట్టి షాకిచ్చింది. పొదుపు ఖాతాల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేనిపక్షంలో విధిస్తున్న అపరాధ రుసుమును ఇటీవల కొన్ని బ్యాంకులు ఎత్తివేస్తున్న సంగతి తెలిసిందే.

షాకిచ్చిన ఐసీఐసీఐ.. మినిమం 50 వేలు
ఐసీఐసీఐ బ్యాంక్ తమ ఖాతాదారులకు గట్టి షాకిచ్చింది. పొదుపు ఖాతాల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేనిపక్షంలో విధిస్తున్న అపరాధ రుసుమును ఇటీవల కొన్ని బ్యాంకులు ఎత్తివేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంక్‌ ఐసీఐసీఐ మాత్రం సేవింగ్‌ అకౌంట్లలో కనీస సగటు నిల్వను భారీగా పెంచేసింది. మెట్రో, అర్బన్‌, సెమీ అర్బర్‌, గ్రామీణ బ్రాంచ్‌ ఖాతాదారులందరిపై ఈ పెంపు భారం మోపింది. ఈ నిబంధన ఆగస్టు 1 తర్వాత సేవింగ్స్‌ ఖాతా తెరిచే కస్టమర్లకు వర్తించనుంది. ఇప్పటికే ఉన్న ఖాతాదారులకు వర్తించదు. గతంలో రూ.10వేల వరకు ఉన్న పరిమితిని ఒకేసారి ఐదు రెట్లు పెంచేసింది. ఇక, సెమీ అర్బన్‌ కస్టమర్ల కనీస సగటు నిల్వ మొత్తాన్ని రూ.5వేల నుంచి రూ.25వేలకు పెంచింది. గ్రామీణ ఖాతాదారులకు రూ.2,500 నుంచి రూ.10వేలకు పెంచేసింది. దీనిపై ఖాతాదారుల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ICICI Bank
Minimum Balance
Savings Account
Banking News
Metro Branch
Urban Branch
Semi Urban Branch
Rural Branch
India Banking
ICICI Charges
Scroll for the next article