News28th Apr 04:52 PMSunil Byrisetty1 min read
మానవత్వం ఉండాలి.. హైకోర్ట్ సంచలన తీర్పు
సమాజంలో ఎవరూ చేయలేని పని చేసే పారిశుధ్య కార్మికుల విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఏపీలోని పారిశుధ్య కార్మికులు మురుగు డ్రెయిన్లు శుభ్రపరుస్తూ మరణిస్తే ఆ క
సమాజంలో ఎవరూ చేయలేని పని చేసే పారిశుధ్య కార్మికుల విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని హైకోర్టు అభిప్రాయపడింది.
ఏపీలోని పారిశుధ్య కార్మికులు మురుగు డ్రెయిన్లు శుభ్రపరుస్తూ మరణిస్తే ఆ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
వారి కుటుంబాలకు రూ.30 లక్షలు చెల్లించాలని హైకోర్టు కూటమి ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇటీవల మరణించిన మాణిక్యాలరావు అనే కార్మికుడు విషయంలో హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, మాణిక్యాలరావుకు ప్రభుత్వం రూ.10 లక్షలు చెల్లించింది.
మరో రూ. 20 లక్షలు ఇవ్వడంతో పాటు మృతుడి భార్యకు ఉద్యోగం కూడా ఇవ్వాలని హైకోర్ట్ తీర్పునిచ్చింది.
ఈ తీర్పుపై రాష్ట్రంలో హర్షం వ్యక్తమవుతోంది.