Telangana1st Sep 01:55 PMSunil Byrisetty1 min read

ఏడేళ్లు కనిపించకపోతే చనిపోయినట్లే

చట్ట ప్రకారం ఏడేళ్లు ఎవరైనా కనిపించకుండాపోతే చనిపోయినట్లేనని తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 21 ఏళ్ల క్రితం అదృశ్యమైన భర్త ఉద్యోగం ఇవ్వాలని క్యాన్సర్తో బాధపడుతున్న మహిళ ప

 ఏడేళ్లు కనిపించకపోతే చనిపోయినట్లే
చట్ట ప్రకారం ఏడేళ్లు ఎవరైనా కనిపించకుండాపోతే చనిపోయినట్లేనని తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 21 ఏళ్ల క్రితం అదృశ్యమైన భర్త ఉద్యోగం ఇవ్వాలని క్యాన్సర్తో బాధపడుతున్న మహిళ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. చట్ట ప్రకారం ఏడేళ్లు ఎవరైనా కనిపించకుండాపోతే చనిపోయినట్లేనని, వారసత్వం కింద కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని ఇండియన్ బ్యాంకుకు సూచించింది. వారికి రావాల్సిన పదవీ తొలగింపు ప్రయోజనాలు చెల్లించాలని సూచించింది. ఈ మేరకు ఖమ్మంకు చెందిన వనపట్ల సుగుణ పిటిషన్ పై జస్టిస్ నగేశ్ భీమపాక ఈ ఆదేశాలు ఇచ్చారు.
Telangana High Court
Missing Person Law
Legal Ruling
Inheritance Rights
Employment Rights
Indian Banks
సుగుణ పిటిషన్
జస్టిస్ నాగేశ్ భీమపాక్
Scroll for the next article