News17th Nov 03:43 PMSunil Byrisetty1 min read

పనిగంటల పెంపు జీవోను రద్దు చేయాలి

ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాపితంగా జిల్లా కేంద్రాలలో ఆందోళనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ఇఫ్టూ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో జి

పనిగంటల పెంపు జీవోను రద్దు చేయాలి
ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాపితంగా జిల్లా కేంద్రాలలో ఆందోళనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ఇఫ్టూ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఇఫ్టూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కి సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం అందించారు. ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షులు కె. పోలారి రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను జాయింట్ కలెక్టర్ కి వివరించారు. చారిత్రాత్మకమైన మేడే ఉద్యమం ద్వారా సాధించుకున్న రోజుకు 8 పని గంటలను చంద్రబాబు ప్రభుత్వం 10 గంటలుగా పెంచుతూ నవంబర్ 3న జీవో 23 ను జారీ చేయడం దుర్మార్గమన్నారు. వెంటనే జీవోను ఉపసహరించాలని కోరారు. అదే విధంగా గత పన్నెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో వివిధ కార్మిక సమూహలకు కనీస వేతనాలు పెంచక పోవడం అన్యాయం కాదా అంటూ, కనీస వేతనం 26 వేలకు పెంచాలన్నారు.
IFTU
GO 23
Working Hours Increase
Workers’ Rights
Vijayawada Protest
NTR District
Chandrababu Government
కనీస వేతనాలు
మేడే ఉద్యమం
కార్మిక సంఘాల ఆందోళన
Scroll for the next article