Jobs30th Sep 05:17 PMSunil Byrisetty1 min read
కెపాసిటీ బిల్డింగ్‌పై ఐఐటీ, ఐఐఎంలతో శిక్షణ
ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిరంతర ప్రక్రియగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ, అన్నక్యాంటీన్లు, పట్టణ ప్రాంతాల్లో త
ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిరంతర ప్రక్రియగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ, అన్నక్యాంటీన్లు, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం, సంక్షేమ హాస్టళ్లల్లో వసతులు వంటి అంశాలపై చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కెపాసిటీ బిల్డింగ్, నైపుణ్య శిక్షణలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ అగ్ర స్థానంలో ఉందని సీఎం చెప్పారు. ఐగాట్ కర్మ యోగి ద్వారా వివిధ కోర్సుల్లో శిక్షణ ఇప్పించామని.. రియల్ టైమ్‌లో పని చేసేలా ఉద్యోగులు శిక్షణ పొందుతున్నారన్నారు. ఐఏఎస్ అధికారులు ఎప్పటికప్పుడు ఓరియేంటేషన్ తీసుకుంటూ స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకుంటారో.. అదే తరహాలో ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్యాభివృద్ధి ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగులకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం ఐఐటీ, ఐఐఎంలతో శిక్షణ ఇప్పించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.