News14th Jul 04:28 PMSunil Byrisetty1 min read
రాజధానిలో మట్టి మాఫియా దోపిడీ
అమరావతి రాజధానిలో మట్టి అక్రమ దందా మూడు ప్రొక్లెయిన్లు.. ఆరు టిప్పర్లు అన్నట్లు సాగుతోంది. గత వైకాపా ప్రభుత్వ హయాం నుంచి నేటి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన వరకూ సుమారు గత ఐదేళ్ల నుంచి
అమరావతి రాజధానిలో మట్టి అక్రమ దందా మూడు ప్రొక్లెయిన్లు.. ఆరు టిప్పర్లు అన్నట్లు సాగుతోంది. గత వైకాపా ప్రభుత్వ హయాం నుంచి నేటి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన వరకూ సుమారు గత ఐదేళ్ల నుంచి రాజధాని ప్రాంతంలో మట్టి అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతూనే ఉంది. రాజధాని ప్రాంతంలో రహదారుల నిర్మాణం తవ్వుతున్న మట్టితో పాటు పక్కనే ఉన్న ఖాళీ స్థలాల్లో సైతం ప్రొక్లెయిన్ల సహాయంతో అక్రమంగా తవ్వుకుని టిప్పర్ల సహాయంతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో చేపడుతున్న రహదారుల నిర్మాణం కోసం తవ్వుతున్న మట్టిని ఈ ప్రాంతంలోనే వినియోగించాల్సి ఉంది. కానీ రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా పదుల సంఖ్యలో ప్రొక్లెయిన్లతో మట్టిని తవ్వి టిప్పర్లతో తరలిస్తున్నారు. రాజధాని గ్రామాలైన నవులూరు, యర్రబాలెం, కురగల్లు కృష్ణాయపాలెం, వెంకటపాలెం, మందడం, వెలగపూడి, లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, తుళ్లూరు, బోరుపాలెం, అబ్బురాజు పాలెం, నెక్కల్లు, అనంతవరం గ్రామాల నుంచి మట్టి అక్రమ రవాణా ఐదేళ్లుగా జోరుగా సాగుతూనే ఉంది.