News26th Apr 05:30 PMSunil Byrisetty1 min read

చల్లటి కబురు.. మే తొలి వారంలో వర్షాలు!

వాతావరణ శాఖ ఏపీకి చల్లటి కబురు చెప్పింది. మండుటెండలతో సొమ్మసిల్లిపోతున్న ప్రజలకు ఉపశమనం కల్పించే వార్త తెలిపింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మే మొదటి వారంలో దక్షిణాది రాష్ట్

చల్లటి కబురు.. మే తొలి వారంలో వర్షాలు!
వాతావరణ శాఖ ఏపీకి చల్లటి కబురు చెప్పింది. మండుటెండలతో సొమ్మసిల్లిపోతున్న ప్రజలకు ఉపశమనం కల్పించే వార్త తెలిపింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మే మొదటి వారంలో దక్షిణాది రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మేలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశముందని పేర్కొంది. రాబోయే ఐదు రోజుల్లో రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
Andhra Pradesh
Weather Update
Meteorological Department
దక్షిణాది రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు
శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి వానలు
Scroll for the next article