News25th Sep 12:41 PMSunil Byrisetty1 min read
పంట నష్టాలపై తక్షణ సర్వే..
తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. దెబ్బతిన
తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల నష్ట వివరాలను సేకరించి, అత్యవసర పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. భారీ వర్షాల ప్రభావం, తక్షణం చేపట్టాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బూడితి రాజశేఖర్, వ్యవసాయ శాఖ కమిషనర్ జిలానీ, ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీనివాసులు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్, మత్స్యశాఖ కమిషనర్ తదితర ఉన్నతాధికారులతో మంత్రి ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే పార్వతీపురం మన్యం, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌లో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించి, సహాయక చర్యలు, మౌలిక సదుపాయాల పునరుద్ధరణపై దిశానిర్దేశం చేశారు.