Education11th Mar 11:31 AMSunil Byrisetty1 min read

అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ వర్తింపజేయాలి

మార్చి 12 నుంచి జరగబోయే శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ వర్తించేలా చ

అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ వర్తింపజేయాలి
మార్చి 12 నుంచి జరగబోయే శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ వర్తించేలా చట్టానికి రూపకల్పన చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ పరీక్షల ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ఎమ్మార్పీఎస్ , ఎంఎస్పి హైదరాబాద్ జిల్లా కమిటీ అధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని ఆగస్టు 1న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు . గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రూపొందించి ( రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ ఆక్ట్ ,2000) , ఆ చట్టంలో గతంలో ఇచ్చిన ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ కు వర్గీకరణ సూత్రం వర్తింపజేసేలా 4 వ నిబంధనను పొందుపరిచారు. దాని వల్ల ఆనాడు మాదిగ నిరుద్యోగులకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. ఇప్పుడు ఆ చట్టాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలన చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Telangana
SC
ST
Caste
తెలంగాణ
ఎస్సీ
ఎస్టీ
కులం
Scroll for the next article