Health28th Nov 12:22 PMSunil Byrisetty1 min read
వినికిడి లోపానికి మెరుగైన వైద్య సేవలు
వినికిడి లోపం కలిగిన వారికి వైద్య సేవల్ని మరింత చేరువ చేసేందుకు రాష్ట్రంలోని 63 ప్రభుత్వాసుపత్రుల్లో కొత్తగా 'బెరా' (Brainstem Evoked Response Audiometry) పరికరాలను రూ.15.11 కోట్
వినికిడి లోపం కలిగిన వారికి వైద్య సేవల్ని మరింత చేరువ చేసేందుకు రాష్ట్రంలోని 63 ప్రభుత్వాసుపత్రుల్లో కొత్తగా 'బెరా' (Brainstem Evoked Response Audiometry) పరికరాలను రూ.15.11 కోట్ల వ్యయంతో సమకూర్చనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రస్తుతం బోధనాసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పరికరాలను తొలిసారిగా 9 జిల్లా ఆసుపత్రులు, 54 ప్రాంతీయ ఆసుపత్రుల్లోనూ అందుబాటులోనికి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. బెరా పరికరాల ద్వారా వినికిడి లోపం ఉన్న బాధితులకు సూక్ష్మ స్థాయిలో ఎంత మేరకు ఉందో వైద్యులు గుర్తించేందుకు సులువవుతుందని తెలిపారు. దీనికి అనుగుణంగా వైద్యులు అందించే చికిత్సవల్ల రోగులకు వినికిడి లోపం మరింత పెరగకుండా ఉంటుందని గురువారంనాడొక ప్రకటనలో మంత్రి సత్యకుమార్ తెలిపారు. 63 అసుపత్రుల్లో 2 నుంచి 3 నెలల్లోగా అందుబాటులోనికి రానున్న ఒక్కొక్క బెరా పరికరం, ఇతర సౌకర్యాల కల్పనకు రూ.26 లక్షల నుంచి గరిష్టంగా రూ.32 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు పెడుతుందని పేర్కొన్నారు.