News11th Jul 12:15 PMSunil Byrisetty1 min read
ట్రాఫిక్ నియంత్రణకు 16 నూతన ద్విచక్ర వాహనాలు
కడప జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణకు 16 నూతన ద్విచక్ర వాహనాలను ఎస్పీ ఇ.జి అశోక్ కుమార్ ప్రారంభించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఒక బుల్లెట్ వాహనం, 15 -
కడప జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణకు 16 నూతన ద్విచక్ర వాహనాలను ఎస్పీ ఇ.జి అశోక్ కుమార్ ప్రారంభించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఒక బుల్లెట్ వాహనం, 15 - అపాచి ఆర్.టి.ఆర్ ద్విచక్ర వాహనాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రారంభించారు. డిజిపి ఆఫీసు మంగళగిరి నుండి వచ్చిన ఈ వాహనాలకు సైరన్, బ్లింకర్స్, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం, క్రౌడ్ కంట్రోల్ చేయడానికి అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారన్నారు. జిల్లాలోని కడప ట్రాఫిక్ పియస్‌కి 7, ప్రొద్దుటూరు ట్రాఫిక్ పియస్‌కి 4, పులివెందుల ట్రాఫిక్ పి.ఎస్ కు 2, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలుకు ఒకొక్కటి చొప్పున నూతన వాహనాలు కేటాయిస్తున్నామన్నారు.విజిబుల్ పోలీసింగ్ పెరగడంతో ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని భావిస్తున్నామన్నారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినప్పుడు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
ఫోర్ వీలర్ వెళ్ళలేని ప్రాంతాలలో టూ వీలర్స్ వెళ్ళి అక్కడ ట్రాఫిక్ సమస్యను తగ్గించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో పని చేస్తాయన్నారు.