Sports3rd Aug 10:20 AMSunil Byrisetty1 min read
ఆ రికార్డు తిరగరాస్తారా?
ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. లీడ్స్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లాండ్‌కు 371 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆతిథ్య జట్టు ఆ లక్ష్యాన్ని సాధించింద
ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. లీడ్స్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లాండ్‌కు 371 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆతిథ్య జట్టు ఆ లక్ష్యాన్ని సాధించింది. ఇప్పుడు చివరి టెస్ట్‌లో భారత జట్టు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, ఇక్కడే ఇంగ్లాండ్ సవాలు లీడ్స్ కంటే కష్టతరంగా మారింది. సిరీస్‌ను సమం చేయాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్‌కు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ చేధించగలిగితే, ఓవల్ మైదానం చరిత్రలోనే అది అత్యధిక రన్ ఛేజ్ అవుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 224 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లాండ్ 247 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్‌కు 23 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు 374 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవల్ మైదానంలో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక రన్ ఛేజ్ రికార్డు 1902లో నమోదైంది. ఆ రికార్డును తిరగరాస్తారా అనేది చూడాల్సి ఉంది.