Sports19th Jun 01:52 PMSunil Byrisetty1 min read

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా రెడీ!

టీమిండియా, ఇంగ్లండ్‌ మధ్య అయిదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌‌కు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే సిరీస్లో మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ లీడ్స్‌లోని హెడింగ్లే వేదికగా జరగనుంద

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా రెడీ!
టీమిండియా, ఇంగ్లండ్‌ మధ్య అయిదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌‌కు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే సిరీస్లో మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ లీడ్స్‌లోని హెడింగ్లే వేదికగా జరగనుంది. యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌గా, రిషభ్‌ పంత్‌ వైస్‌ కెప్టెన్‌గా పోరుకు సన్నద్ధమైంది. ఇంగ్లండ్‌ను వారి సొంత మైదానాల్లో ఎదుర్కోవడం తేలికేమీ కాకపోయినా, భారత జట్టు బలంగా నిలబడితే గెలుపు సాధ్యమే. సాయి సుదర్శన్‌, యశస్వి జైస్వాల్‌, రిషభ్ పంత్‌, కేఎల్‌ రాహుల్‌, కరుణ్‌ నాయర్‌ మన బ్యాటింగ్ బలం కాగా, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, కుల్‌దీప్‌ యాదవ్‌ లాంటి బౌలర్లు, రవీంద్ర జడేజా బౌలింగ్‌ను పటిష్టం చేస్తున్నారు. అలాగే ఆల్ రౌండర్లైన వాషింగ్టన్‌ సుందర్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డితో టీమిండియా దీటైన జట్టుగా ఉంది. ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీమిండియా ఎలాంటి ప్రదర్శన ఇస్తుందనే ఆసక్తి నెలకొని ఉంది.
Sports news
england vs india
team india
Cricket match
Shubman Gill
rishabh pant
Ravindra Jadeja
టీమిండియా
ఇంగ్లండ్ మధ్య అయిదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్
మొదటి టెస్ట్ మ్యాచ్ లీడ్స్లోని హెడింగ్లే వేదిక
Scroll for the next article