News15th Aug 12:03 PMSunil Byrisetty1 min read
దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం జాతీయ పతాకాన్ని బిజెపి ఎపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.యన్ మాధవ్ ఎగురవేశారు. లక్షలాద
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం
జాతీయ పతాకాన్ని బిజెపి ఎపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.యన్ మాధవ్ ఎగురవేశారు. లక్షలాది మంది త్యాగ ఫలం తో మనకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు.
స్వాతంత్ర్యం కోసం బలి దానం చేసిన వారందరనీ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. దేశం కోసం పోరాటం చేసిన వారి ఇళ్లకు వెళ్లి వారిని గౌరవించే కార్యక్రమానికి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారని చెప్పారు. దేశం ముక్కలు కావడానికి కారణం కాంగ్రెస్ అని మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.