News23rd Oct 05:20 PMSunil Byrisetty1 min read

రూపాయి నాణాలతో నామినేషన్

రూపాయి నాణాలతో డబ్బులు సమకూర్చుకున్న స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. గ్రామస్థులు ప్రతి ఇంటినుండి తనకు నామినేషన్ దరఖాస్తు రుసుము కోసం రూపాయి నాణాలు విరాళం ఇచ్చారని.. వాళ్ళ

రూపాయి నాణాలతో నామినేషన్
రూపాయి నాణాలతో డబ్బులు సమకూర్చుకున్న స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. గ్రామస్థులు ప్రతి ఇంటినుండి తనకు నామినేషన్ దరఖాస్తు రుసుము కోసం రూపాయి నాణాలు విరాళం ఇచ్చారని.. వాళ్ళు ఇచ్చిన డబ్బుతోనే నామినేషన్ వేస్తున్నానని అభ్యర్థి చెప్పారు. తిరుపతిలోని చిగురువాడకు చెందిన స్వతంత్ర అభ్యర్థి సుభద్ర తన నామినేషన్ దాఖలు చేసేందుకు చేతిలో సంచులతో రావడంతో పోలీసులు తనిఖీ చేశారు..అందులో వందల సంఖ్యలో ఉన్న రూపాయి నాణాలు చూసి ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా తాను సేకరించిన రూ.ఆరువేల నగదు మొత్తం నాణాల రూపంలో ఉన్నాయని.. అందువల్లే సంచులలో తీసుకువచ్చానని చెప్పారు. మొత్తానికి అధికార ప్రతిపక్ష పార్టీలు నామినేషన్ల పర్వంలోనే పరస్పర దాడులు దౌర్జన్యాలు హింసకు పాల్పడుతున్న పరిస్థితుల్లో ఓ స్వతంత్ర అభ్యర్థి ఇలా ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవిస్తూ గ్రామస్థులు ఇచ్చిన విరాళాలతో నామినేషన్ వేయడం అందరినీ ఆకట్టుకుంది.
Scroll for the next article