Mobiles27th Dec 04:47 PMSunil Byrisetty1 min read
ఫోన్స్ తయారీలో టాప్ 2 భారత్!
ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా భారత్ అవతరించిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. గత 11 ఏళ్లలో దేశీయంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి ఆరు
ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా భారత్ అవతరించిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. గత 11 ఏళ్లలో దేశీయంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగిందని తెలిపారు. ఎగుమతులు ఏకంగా ఎనిమిది రెట్లు వృద్ధి చెందాయని ఆయన 'ఎక్స్'లో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం ఈ అద్భుత ప్రగతికి చోదకశక్తిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో ఏడో స్థానంలో ఉన్న భారత్ మూడో అతిపెద్ద ఎగుమతి కేటగిరీగా ఎదగడం ‘మేక్ ఇన్ ఇండియా’ విజయానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.