News30th Sep 05:25 PMSunil Byrisetty1 min read

అక్టోబర్ 2 నుంచి 'సేవ్ డెమోక్రసీ'

న్యూఢిల్లీలో కాంగ్రెస్ నేతృత్వంలో నిర్వహించిన ఇండి కూటమి సమావేశం ముగిసింది. ఈసీ వ్యవహారాలపై దశలవారీగా ఇండి కూటమి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. అక్టోబర్ 2 నుంచి 8 వరకు 'సేవ

అక్టోబర్ 2 నుంచి 'సేవ్ డెమోక్రసీ'
న్యూఢిల్లీలో కాంగ్రెస్ నేతృత్వంలో నిర్వహించిన ఇండి కూటమి సమావేశం ముగిసింది. ఈసీ వ్యవహారాలపై దశలవారీగా ఇండి కూటమి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. అక్టోబర్ 2 నుంచి 8 వరకు 'సేవ్ డెమోక్రసీ' పేరుతో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. అక్టోబర్ 6న ఈసీ ఆఫీస్ ముట్టడికి అన్ని పార్టీల ఎంపీలు మార్చ్ చేస్తారన్నారు. ముట్టడిలో లోక్‌సభ, రాజ్యసభకు చెందిన కూటమి పార్టీల ఎంపీలు పాల్గొననున్నారు. అక్టోబర్ రెండో వారంలో కూటమి పార్టీ నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు. అనంతరం ఇండి కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుందన్నారు.
Scroll for the next article