National7th Nov 12:06 PMSunil Byrisetty1 min read
వందేమాతరం@150
ప్రతి గీతానికి ఒక మూల భావం, సందేశం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వందేమాతరం మూల భావం భారత్.. మా భారతి.. భారత్ సంకల్పం ప్రతి వ్యక్తి నిలదొక్కుకునే ప్రేరణా నిలిచిందని పేర్క
ప్రతి గీతానికి ఒక మూల భావం, సందేశం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వందేమాతరం మూల భావం భారత్.. మా భారతి.. భారత్ సంకల్పం ప్రతి వ్యక్తి నిలదొక్కుకునే ప్రేరణా నిలిచిందని పేర్కొన్నారు. వందేమాతరం గేయం దేశమాత ఆరాధన, సాధన అని, వందేమాతరం..మనల్ని పురాణ ఇతిహాసాల్లోకి తీసుకెళ్తుందని వివరించారు. వందేమాతరం శబ్దం ఆత్మవిశ్వాసం నింపుతుందన్నారు. పూర్వీకులు భారత్‌ను సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. భారత్ అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని అమరత్వం పొందిందని, వందేమాతరం దేశ స్వాతంత్య్రానికి ప్రేరణగా నిలిచిందని కొనియాడారు. బంకించంద్ర ఆనందమఠ్ ఉపన్యాసం మాత్రమే కాదు.. భారత స్వప్నం అని ఠాగూర్ చెప్పారని మోదీ పేర్కొన్నారు. వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ మేరకు ప్రకటించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్లో భారతదేశం మ్యాపు, వందేమాతరం@150 రూపంలో 500 మంది విద్యార్థుల ప్రదర్శించారు.