National8th Oct 10:24 AMSunil Byrisetty1 min read
వేలిముద్రతో యూపీఏ పేమెంట్స్
పేమెంట్స్ చెల్లింపులకు సంబంధించిన యూపీఐలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు తీసుకొచ్చింది. చెల్లింపులకు ఇప్పటివరకు పిన్ నమోదు చేస్తుండగా, ఇకపై వేలి ముద్ర, ఫేషియల్ రికగ్నిషన్‌తోనూ లావాదే
పేమెంట్స్ చెల్లింపులకు సంబంధించిన యూపీఐలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు తీసుకొచ్చింది. చెల్లింపులకు ఇప్పటివరకు పిన్ నమోదు చేస్తుండగా, ఇకపై వేలి ముద్ర, ఫేషియల్ రికగ్నిషన్‌తోనూ లావాదేవీ పూర్తి కానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఈ విధానాన్ని ఆవిష్కరించినట్లు ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు వెల్లడించారు. ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆధార్ కార్డులో నమోదైన బయోమెట్రిక్ సమాచారాన్ని ఉపయోగించి ఈ వ్యవస్థ పనిచేయనుంది. పిన్ నమోదు పద్ధతిలో ప్రస్తుతం జరుగుతున్న యూపీఐ లావాదేవీలతో పోలిస్తే, కొత్త విధానం వల్ల భద్రత మరింత పటిష్ఠం కావడమే కాక, లావాదేవీ సమయం 25% వరకు తగ్గుతుందని చెబుతున్నారు. మొబైల్ యాప్ ద్వారా ఏదైనా కొనుగోలు చేస్తున్నప్పుడు, పిన్ నమోదు చేయకుండానే ముఖాన్ని స్కాన్ చేయడం లేదా వేలిముద్ర ఆధారంగా చెల్లింపు పూర్తిచేయొచ్చు.