National29th May 10:46 AMSunil Byrisetty1 min read
చైనా ఉత్పత్తులపై నిఘా!
భారత్‌లో CCTV ప్రొడక్ట్స్ అమ్మే చైనా కంపెనీలు తమ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ను భారత ల్యాబ్‌లలో పరీక్షించాలని కేంద్రం ఆదేశించింది. ఇది చైనా నిఘా ఆందోళనలను నియంత్రించేందుకు తీసుకున్న చ
భారత్‌లో CCTV ప్రొడక్ట్స్ అమ్మే చైనా కంపెనీలు తమ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ను భారత ల్యాబ్‌లలో పరీక్షించాలని కేంద్రం ఆదేశించింది. ఇది చైనా నిఘా ఆందోళనలను నియంత్రించేందుకు తీసుకున్న చర్య. హిక్‌విజన్, డాహువా వంటి కంపెనీలు ఈ నిబంధనలను తప్పకుండా పాటించాలి. భారత మార్కెట్ లో చైనా CCTV కంపెనీల వాటా 30% గావుంది. ఈ చర్య వల్ల స్థానిక కంపెనీలు లాభపడవచ్చు. కొన్ని రైల్వే ప్రాజెక్ట్ లలో CCTV లు, ట్రాకింగ్ లకు టెండర్ లు పిలిస్తే ఇక్కడి కంపెనీలు చైనా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని చౌకగా తెస్తాయని పెట్టిన వాటిలో నిఘా కెమెరాలు ఉన్నాయని తరువాత బయట పడింది. ఆంధ్రలో ఫైబర్నెట్ ప్రాజెక్ట్ లో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. తరువాత వాటిని మార్చి కంపెనీలను నిషేధించారు.