News30th Jan 02:41 PMSunil Byrisetty1 min read
ఎలక్ట్రానిక్స్ రంగంలో రెండో స్థానానికి భారత్
విజయవాడలో జనతా వారధి కార్యక్రమంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టడం ద
విజయవాడలో జనతా వారధి కార్యక్రమంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో రికార్డు అని, ఆమె అనుభవం, ప్రజల నమ్మకాన్ని తెలియజేస్తోందని పాకా సత్యనారాయణ చెప్పారు. ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని, దేశ వృద్ధి రేటు పెరిగి ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనా వేశారు. భారత్ ఆర్థిక వ్యవస్థ 2014లో 11వ స్థానం నుంచి నేడు 4వ స్థానానికి చేరుకుందని, బడ్జెట్ పరిమాణం రూ.14.30 లక్షల కోట్ల నుంచి రూ.50.40 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. కోవిడ్, ప్రపంచ యుద్ధాల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొందని, ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రం తీసుకోవడంతో పనులు వేగవంతమవుతాయని, అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్యాకేజీలు, నాబార్డ్ సహాయం అందుతాయని చెప్పారు.