News1st Aug 12:15 PMSunil Byrisetty1 min read
రిజిస్టర్డ్ పోస్టులు ఇక స్పీడ్ పోస్టులో విలీనం
పోస్టల్ శాఖలో సెప్టెంబరు ఒకటి నుంచి కొత్త విధానం దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న రిజిస్టర్డ్ పోస్టు విధానాన్ని తపాలా శాఖ స్పీడ్ పోస్టులో విలీనం చేయబ
పోస్టల్ శాఖలో సెప్టెంబరు ఒకటి నుంచి కొత్త విధానం దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న రిజిస్టర్డ్ పోస్టు విధానాన్ని తపాలా శాఖ స్పీడ్ పోస్టులో విలీనం చేయబోతోంది. ఈ విధానం సెప్టెంబరు ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వినియోగదారులకు అత్యంత వేగవంతమైన, మెరుగైన సేవల్ని అందించాలని భావిస్తోంది. అలాగే ట్రాకింగ్ విధానాన్ని సులభతరం చేయడం, అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తేవాలని తపాలా శాఖ నిర్ణయించింది. ఆమేరకు దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్ల పరిధిలోని మెయిల్ ఆపరేషన్ డివిజన్లకు ఆదేశాలు అందాయి.