News12th Mar 10:25 AMSunil Byrisetty1 min read
కొత్త నోట్లు వచ్చేస్తున్నాయ్!
దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత నోట్ల చలామణి తగ్గిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ. 2 వేలు, రూ. 5 వందలు, రూ. 2 వందలు, రూ. వంద, రూ. యాభై, రూ. 20, రూ. 10 నోట్లను కొత్తగ
దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత నోట్ల చలామణి తగ్గిన విషయం తెలిసిందే.
పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ. 2 వేలు, రూ. 5 వందలు, రూ. 2 వందలు, రూ. వంద, రూ. యాభై, రూ. 20, రూ. 10 నోట్లను కొత్తగా ప్రవేశపెట్టింది.
ఇటీవల రూ. 2 వేల నోట్ల ముద్రణ నిలిపివేయడంతో చలామణి లేకుండా పోయింది. దేశంలో నోట్ల చలామణి, అవసరాలు, నోట్లు దెబ్బతినడం, ద్రవ్యోల్బణం, బంగారం నిల్వలు ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లు, కాయిన్స్ ముద్రణ చేపడుతూ ఉంటుంది.
ఇటీవల ఆర్బబీఐకి కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియమితులైన నేపథ్యంలో ఆయన సంతకంతో కొత్తగా రూ. 100, రూ. 200 నోట్లు ముద్రించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చినా పాత నోట్ల చెల్లుబాటుపై ఎలాంటి ప్రభావం ఉండదు.
కొత్తగా ముద్రించే నోట్లు సైతం మహాత్మాగాంధీ సిరీస్‌లోనే ఉండనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.