International12th Aug 11:03 AMSunil Byrisetty1 min read

క్యూబాకు భారత్‌ మందులు

ఔషధాల కొరతను ఎదుర్కొంటున్న క్యూబా ప్రజలకు సంఘీభావంగా భారతదేశం నుంచి కమ్యూనిస్టు పార్టీలు మందులు సేకరించాయి. వాటిని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ హవా

క్యూబాకు భారత్‌ మందులు
ఔషధాల కొరతను ఎదుర్కొంటున్న క్యూబా ప్రజలకు సంఘీభావంగా భారతదేశం నుంచి కమ్యూనిస్టు పార్టీలు మందులు సేకరించాయి. వాటిని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ హవానాలో క్యూబా వైద్యులకు అందజేశారు. క్యూబాపై అమెరికా ఆంక్షలు, ఆర్థిక దిగ్బంధనం కారణంగా అవసరమైన మందులు, వైద్య సామగ్రి అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హవానాలో జరిగిన కార్యక్రమంలో క్యూబా వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ఈ మందులను కె. రామకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు ఉద్యమం తరఫున క్యూబా ప్రజలకు తమ సంపూర్ణ సంఘీభావాన్ని, స్నేహాన్ని ఆయన తెలియజేశారు. క్యూబా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కేవలం క్యూబా సమస్య కాదని, ప్రపంచవ్యాప్తంగా శాంతి, మానవత్వం, సామాజిక న్యాయం కోరుకునే ప్రజలందరి సమస్య అని రామకృష్ణ పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక దిగ్బంధనాన్ని ఎత్తివేసి, క్యూబా ప్రజలకు స్వేచ్ఛ కల్పించాలని ఆయన కోరారు.
India
Cuba
Medicines
Cuba Medicine Shortage
CPI
K Ramakrishna
Havana
Cuban Doctors
Healthcare
Medical Supplies
భారత కమ్యూనిస్టు పార్టీ
అమెరికా ఆంక్షలు
ఆర్థిక దిగ్బంధనం
అంతర్జాతీయ సంఘీభావం
Scroll for the next article