Sports25th Sep 10:51 AMSunil Byrisetty1 min read
ఆసియా కప్ ఫైనల్‌కు టీమిండియా
వరుస విజయాలతో టీమిండియా దూసుకెళ్తోంది. ఆసియా కప్ ఫైనల్ బరిలోకి భారత్ అడుగుపెట్టింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన సూపర్-4 మ్యాచ్లో బంగ్లాదేశ్పై 41 పరుగుల తేడాతో విజయం సాధిం
వరుస విజయాలతో టీమిండియా దూసుకెళ్తోంది. ఆసియా కప్ ఫైనల్ బరిలోకి భారత్ అడుగుపెట్టింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన సూపర్-4 మ్యాచ్లో బంగ్లాదేశ్పై 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఇచ్చిన 169 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బంగ్లాదేశ్ జట్టు 19.2 ఓవర్లలోనే 128 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ సైఫ్ హసన్ ఒక్కడే ప్రతిఘటిస్తూ 69 పరుగులు సాధించాడు. అయితే మిగతా 9 మంది బ్యాటర్లు రెండంకెల స్కోరు కూడా అందుకోలేకపోయారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా, జస్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో టీమ్ ఇండియా ఫైనల్కి అర్హత సాధించింది. అంతకుముందు పాక్‌పై రెండు మ్యాచ్ ల్లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే.