News5th May 11:01 AMSunil Byrisetty1 min read
పాకిస్థాన్‌కు పోస్టల్ సర్వీస్ బంద్!
పాకిస్థాన్‌కు పోస్టల్ సర్వీసులు నిలిపివేస్తూ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఒక్కో అంశంలో వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పాకిస్థాన్‌కు అన్ని రకాలుగా
పాకిస్థాన్‌కు పోస్టల్ సర్వీసులు నిలిపివేస్తూ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఒక్కో అంశంలో వేగంగా చర్యలు తీసుకుంటోంది.
ఇప్పటికే పాకిస్థాన్‌కు అన్ని రకాలుగా రవాణాను నిలిపేసిన భారత్ తాజాగా మరోసారి గట్టి షాక్ ఇచ్చింది.
పాకిస్థాన్‌కు సంబంధించిన పోస్టల్ సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది.
దీంతో పాక్‌కు పార్సిల్స్, మెయిల్స్ పంపడంపై నిషేధం విధించింది.
పాకిస్థాన్‌కు చెందిన వెబ్‌సైట్‌లను కూడా బ్యాన్ చేసింది.
కేంద్ర కమ్యూనికేషన్ పరిధిలోని తపాలా శాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
కమ్యూనికేషన్ సేవలపైనా త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.