News19th Oct 12:26 PMSunil Byrisetty1 min read
దేశంలో జనగణన-2027కు గెజిట్
కోవిడ్ కారణంగా 2020-21లో జరగాల్సిన జనాభా గణన ప్రారంభం కానుంది. దేశంలో 'జనగణన-2027'కు సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ గెజిట్ విడుదల చేశారు. 2026 ఏప్రిల్ 1 నుంచి
కోవిడ్ కారణంగా 2020-21లో జరగాల్సిన జనాభా గణన ప్రారంభం కానుంది. దేశంలో 'జనగణన-2027'కు సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ గెజిట్ విడుదల చేశారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు రెండు దశల్లో దీన్ని చేపడతారు. తొలిదశలో ఇళ్లు, గృహాల వివరాలు, మలిదశలో జనాభా లెక్కింపు ఉంటుంది. ఈసారి జనాభా లెక్కల్లో కులాల సమాచారాన్ని సేకరించనున్నారు. వ్యక్తిగత వివరాల్ని డిజిటల్‌గా అందించే అవకాశం కూడా కల్పిస్తారు. జనగణన కోసం ఆధునిక పరికరాలు వినియోగించనున్నట్లు చెబుతున్నారు.