Sports14th Jul 12:42 PMSunil Byrisetty1 min read

భారత్-ఇంగ్లాండ్ వన్డే సిరీస్ నేటి నుంచి!

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు మంగళవారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇటీవల టి20 సిరీస్‌లో 0-

భారత్-ఇంగ్లాండ్ వన్డే సిరీస్ నేటి నుంచి!
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు మంగళవారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇటీవల టి20 సిరీస్‌లో 0-4తో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న భారత జట్టు, ఈ వన్డే సిరీస్ తో పరువు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు కె.ఎల్. రాహుల్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి తిరిగి రావడంతో భారత్ బలంగా కనిపిస్తోంది. స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా రాకతో భారత బౌలింగ్ దుర్బేధ్యంగా మారిందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. జో రూట్, జోస్ బట్లర్, ఆదిల్ రషీద్ వంటి అనుభవజ్ఞులు ఇంగ్లాండ్ జట్టులో ఉన్నారు. రాబోయే ఏడాది వన్డే ప్రపంచకప్ ఉండటంతో ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకంగా మారింది. సిరీస్ షెడ్యూల్ ఇలా జులై 14 – బర్మింగ్‌హామ్ (మధ్యాహ్నం 3:30 గంటలకు) మొదటి వన్డే, జులై 16 – కార్డిఫ్ (మధ్యాహ్నం 5:30 గంటలకు) రెండవ వన్డే, జులై 19 – లండన్, లార్డ్స్ (మధ్యాహ్నం 3:30 గంటలకు) మూడవ వన్డే జరగనున్నాయి.
India vs England
IND vs ENG
ODI Series
Shubman Gill
Rohit Sharma
Virat Kohli
Jasprit Bumrah
KL Rahul
Kuldeep Yadav
హ్యారీ బ్రూక్
జో రూట్
జోస్ బట్లర్
ఎడ్జ్‌బాస్టన్
బర్మింగ్‌హామ్
క్రికెట్
Scroll for the next article