National17th May 12:42 PMSunil Byrisetty1 min read

పాక్‌పై దౌత్య యుద్ధాన్ని కొనసాగిస్తున్న భారత్‌

భారత్‌ పాక్‌పై దౌత్య యుద్ధాన్ని కొనసాగిస్తోంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఒంటరిని చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో విదేశాలకు అఖిలపక్ష ఎంపీల బృందాలను పంపేంద

పాక్‌పై దౌత్య యుద్ధాన్ని కొనసాగిస్తున్న భారత్‌
భారత్‌ పాక్‌పై దౌత్య యుద్ధాన్ని కొనసాగిస్తోంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఒంటరిని చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో విదేశాలకు అఖిలపక్ష ఎంపీల బృందాలను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ నిర్ణయించారు. అందులో భాగంగా విపక్ష నేతల నేతృత్వంలోనూ కొన్ని బృందాలు విదేశాల్లో పర్యటించనున్నారు. ఈనెల 22, 23 తేదీల్లో విదేశాలకు ఏడు బృందాలు బయలుదేరనున్నాయి. అమెరికాకు శశిథరూర్‌ నేతృత్వంలో ఒక బృందం, తూర్పు ఐరోపా దేశాలకు బైజయంత్‌ పాండా బృందం, రష్యాకు కనిమొళి నేతృత్వంలోని బృందం, ఆగ్నేయాసియాకు సంజయ్‌ ఝా బృందం, మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు రవిశంకర్‌ ప్రసాద్‌ బృందం, పశ్చిమాసియా దేశాలకు సుప్రియా సూలే బృందం, ఆఫ్రికన్‌ దేశాలకు శ్రీకాంత్‌ షిండే బృందం పర్యటించనున్నాయి. పాక్‌ ఉగ్రవాదం, దుశ్చర్యలను బృందాలు వివరించనున్నాయి.
India
Pakistan
Operation Sindoor
Shashi Tharoor
అఖిలపక్ష ఎంపీల బృందాలను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం
విదేశాలకు ఏడు బృందాలు
ఆఫ్రికన్‌ దేశాలకు శ్రీకాంత్‌ షిండే బృందం
Scroll for the next article