National14th Sep 06:25 PMSunil Byrisetty1 min read
పాక్‌తో భారత్ క్రికెట్.. విమర్శలు?
1984లో ఆరంభమైన ఆసియా కప్లో భారత్ హవా తొలి నుంచి కొనసాగుతూనే వస్తోంది. ఇప్పటి వరకు జరిగిన 16 ఎడిషన్లలో 8సార్లు టైటిల్ గెల్చుకుంది. ప్రతి టైమ్ లైన్‌లో ప్రతి కెప్టెన్ తనదైన శైలితో జట
1984లో ఆరంభమైన ఆసియా కప్లో భారత్ హవా తొలి నుంచి కొనసాగుతూనే వస్తోంది. ఇప్పటి వరకు జరిగిన 16 ఎడిషన్లలో 8సార్లు టైటిల్ గెల్చుకుంది. ప్రతి టైమ్ లైన్‌లో ప్రతి కెప్టెన్ తనదైన శైలితో జట్టుని గెలిపించడం భారత క్రికెట్ చరిత్రలో ఒక స్పెషల్ చాప్టర్. ఆసియా కప్‌లో ఇప్పటిదాకా భారత్‌కు ఐదుగురు కెప్టెన్లు టైటిల్స్ అందించారు. 1988లో ఆసియా కప్‌లో రెండోసారి విజేతగా నిలిచింది భారత్. అప్పుడు కెప్టెన్‌గా ఉన్నారు దిలీప్ వెంగ్‌సర్కార్. 1990, 1995లో భారత్ రెండుసార్లు ఆసియా కప్ ట్రోఫి గెల్చుకుంది. ఈ రెండు విజయాలకు కెప్టెన్‌గా ఉన్నారు అజారుద్దీన్. ప్రత్యేకంగా షార్జాలో జరిగిన ఫైనల్లో 90 పరుగులతో నాటౌట్‌గా ఉండి జట్టుని విజేతగా నిలిపారు అజారుద్దీన్. ఆ మ్యాచ్‌లో సిద్దూతో కలిసి చేసిన 175 పరుగుల భాగస్వామ్యం అభిమానుల మదిలో నిలిచిపోయింది. అయితే ఈసారి మ్యాచ్ భారత్- పాక్ మధ్య కావడంతో పలువురు విమర్శలు చేస్తున్నారు.