News26th Jan 01:19 PMSunil Byrisetty1 min read

ఎంతో మహోన్నతమైన గ్రంధం రాజ్యాంగమే!

దేశంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో సుఖంగా, శాంతిగా జీవించే హక్కును కల్పించిన భారత రాజ్యాంగం మహోన్నతమైన గ్రంధం అని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు పేర్కొన్నారు. రా

ఎంతో మహోన్నతమైన గ్రంధం రాజ్యాంగమే!
దేశంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో సుఖంగా, శాంతిగా జీవించే హక్కును కల్పించిన భారత రాజ్యాంగం మహోన్నతమైన గ్రంధం అని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు పేర్కొన్నారు. రాజ్యాంగ పరిషత్ చైర్మన్ గా డా.బి.ఆర్.అంబేద్కర్ చేసిన కృషి అమోఘమన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా దేశంలోని ప్రతి పౌరుడు నడుచుకోవడమే వారికి మనం అర్పించే ఘనమైన నివాళి అన్నారు. 77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించిన పిదప ఆయన మాట్లాడుతూ 77 వ గణంతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Indian Constitution
Republic Day
Dr B R Ambedkar
Mahatma Gandhi
Koyye Moshen Raju
Andhra Pradesh
Legislative Council
Indian Democracy
Constitutional Values
77th Republic Day
Scroll for the next article