National15th Sep 09:01 AMSunil Byrisetty2 min read
భారత చరిత్ర.. ఒక హెచ్చరిక!
అణుబాంబులతో నాశనమైన జపాన్ ఎవరి వద్దా చేయి చాచకుండా ఆత్మగౌరవంతో తన దేశాన్ని పునర్నిర్మించుకుంది. వారి ఆత్మగౌరవం ఎలాంటిదో చూద్దాం. జపాన్‌లో నివసిస్తున్న ఒక భారతీయుడు జపనీయలు ఎప్పుడూ
అణుబాంబులతో నాశనమైన
జపాన్ ఎవరి వద్దా చేయి చాచకుండా ఆత్మగౌరవంతో తన దేశాన్ని పునర్నిర్మించుకుంది. వారి ఆత్మగౌరవం ఎలాంటిదో చూద్దాం.
జపాన్‌లో నివసిస్తున్న ఒక భారతీయుడు జపనీయలు ఎప్పుడూ తనను వారి ఇంటికి పిలవలేదనే విషయాన్ని గుర్తించి, ఒక జపనీస్ స్నేహితుడిని అడిగాడు.
“ఎందుకు అని?”
అతడు తాము భారతదేశ చరిత్ర నుంచి నేర్చుకున్న హెచ్చరిక అనే పాఠం ఏంటో చెప్పాడు.
పదివేల మంది బ్రిటిష్ వారు 30 కోట్ల మంది ఉన్న ఇండియాను పాలించారు. దురాక్రమణకు వచ్చిన తెల్లవారిని తమ దేశంలోకి ఆహ్వానించింది, వారికి తమ దేశాన్ని అప్పగించింది భారతీయులేనని చెప్పాడు.
"మీ ప్రజలను అణిచివేసి, కొట్టమని, కాల్చమని, వేధించమని బ్రిటిషర్లు చెబితే చేసింది మీ సొంత భారతీయులే" కదా అని గుర్తు చేశాడు.
“జనరల్ డయ్యర్ ‘ఫైర్!’ అనగానే భారతీయులే తోటి భారతీయులపై బుల్లెట్లు వదిలారు. కాన్యూ ఒక్కరైనా ఆ క్రూరుడి మీద తుపాకీ తిప్పారా అని ప్రశ్నించాడు.
మీలోని బానిసత్వం బ్రిటిషర్లకు, మొఘలాయిలకు తల వంచడం వల్లే దేశం పరాయి పాలనలోకి వెళ్ళింది. మీ సొంత ప్రజలే మతం మార్చుకున్నారు. మీ సొంతవాళ్లే మీ వీరులను అప్పగించారు. చంద్రశేఖర్ ఆజాద్‌కు, భగత్‌సింగ్ కు ఎవరూ సహాయం చేయలేదు.
“మీకు విదేశీ శత్రువులు అవసరం లేదు. మీకు మీరే శత్రువులు. అధికారాల కోసం, పదవుల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మిమ్మల్ని తాకట్టు పెట్టుకున్నారు. అందుకే మేము మీకు దూరంగా ఉంటాము.” అని చెప్పాడు.
“భారతీయులు ఇప్పటికీ మారలేదు. ఉచిత విద్యుత్, మద్యం సీసాలకు మీ ఓటును, మీ మనస్సాక్షిని అమ్మేస్తారు. మీ విశ్వాసం దేశంతో లేదు, స్వార్థంతో ఉంది. దేశం బలంగా లేకపోతే, మీరు ఎప్పటికీ సురక్షితం కాదు.”
దేశభక్తి అని నినాదాలు చేయడం కాదు, దేశం కోసం నిలబడటం గొప్ప, అందుకే మేము భారత చరిత్ర నుంచి నేర్చుకున్నాం. మీరూ స్వార్థం కోసం కాకుండా దేశం కోసం ఆలోచించండి అని జపనీయుడు తననెందుకు ఆహ్వానించలేదో వివరించాడు.
భారతీయులారా ఇకనైనా మేల్కొనండి, ఈ సందేశాన్ని అందరికీ షేర్ చేయండి.