Business Type12th Oct 11:30 AMSunil Byrisetty1 min read
భారతదేశంలోని బంగారం విలువ రూ.337 లక్షల కోట్లు
భారతీయులకు ఎంతో ఇష్టమైన బంగారం విలువ రోజురోజుకూ పెరుగుతోంది. ఓవైపు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నా బంగారం కొనేవాళ్లు కొంటూనే ఉన్నారు. సామాన్యులకు అందనంత దూరానికి బంగారం వెళ్లింద
భారతీయులకు ఎంతో ఇష్టమైన బంగారం విలువ రోజురోజుకూ పెరుగుతోంది. ఓవైపు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నా బంగారం కొనేవాళ్లు కొంటూనే ఉన్నారు. సామాన్యులకు అందనంత దూరానికి బంగారం వెళ్లింది. 2025లోనే ఇప్పటి వరకు చూసుకుంటే పసిడి ధర ఏకంగా 62 శాతం పెరిగింది. అయితే, భారత ప్రజల దగ్గర ఎంత బంగారం ఉంది.
10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర (24 క్యారెట్ల) రూ.1.25 లక్షల మార్క్ దాటింది. కిలో వెండి రేటు రూ.1.84 లక్షలపైకి ఎగబాకింది. బంగారం ధర భారీగా పెరిగిన క్రమంలో భారత ప్రజల వద్ద ఉన్న బంగారం విలువపై మోర్గాన్ స్టాన్లీ ఓ నివేదిక విడదల చేసింది.
మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం.. భారత్‌లో ప్రజల వద్ద మొత్తం 34,600 టన్నుల బంగారం ఉంది. ఈ బంగారం విలువ రూ.337 లక్షల కోట్లు. ఇది భారత దేశ జీడీపీలో ఏకంగా 89 శాతంగా ఉంటుందని నివేదిక పేర్కొంది.