News6th Apr 10:37 AMSunil Byrisetty1 min read
పిల్లలకు సోషల్ మీడియా నిషేధం పార్లమెంట్ పరిధిలోది
స్మార్ట్ ఫోన్లు వ్యసనంగా మారుతున్న పరిస్థితుల్లో సమాజంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పిల్లలైతే స్మార్ట్ ఫోన్ ఇవ్వకపోతే తినడం కూడా మానేసి మారం చేస్తు్న్నారు. అయితే సోషల్ మీడియా కంటె
స్మార్ట్ ఫోన్లు వ్యసనంగా మారుతున్న పరిస్థితుల్లో సమాజంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పిల్లలైతే స్మార్ట్ ఫోన్ ఇవ్వకపోతే తినడం కూడా మానేసి మారం చేస్తు్న్నారు.
అయితే సోషల్ మీడియా కంటెంట్ పిల్లలపై దుష్ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో సామాజికవేత్తలు సుప్రీం తలుపు తట్టారు.
13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వాడకుండా నిషేధించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.
దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ఇది పాలసీ అంశమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
దీనిపై చట్టం చేయాలని పార్లమెంట్‌ను కోరాలని సూచించింది.
పిటిషనర్లు సంబంధిత విభాగానికి అర్జీ చేసుకుంటే 8 వారాల్లో పరిష్కరించాలని ఆదేశిస్తూ పిటిషన్ ను సుప్రీం కోర్ట్ కొట్టేసింది.