News28th Jun 01:00 PMSunil Byrisetty1 min read
దేశవ్యాప్తంగా రైల్వే ఛార్జీల పెంపు
దేశవ్యాప్తంగా రైల్వే టికెట్ ధరలు స్వల్పంగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారం నేపథ్యంలో కేంద్ర రైల్వే సహాయ మంత్రి వి. సోమన్న స్పందించారు. ప్రయాణికులపై భారం పడకుండా దశలవారీగా ఛార్
దేశవ్యాప్తంగా రైల్వే టికెట్ ధరలు స్వల్పంగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారం నేపథ్యంలో కేంద్ర రైల్వే సహాయ మంత్రి వి. సోమన్న స్పందించారు. ప్రయాణికులపై భారం పడకుండా దశలవారీగా ఛార్జీలు పెంచేలా కేంద్రం ఆలోచిస్తోందని తెలిపారు. ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. రేట్లు ఒక్కసారిగా కాకుండా క్రమంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే పెంచిన చార్జీలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.