News9th Aug 03:25 PMSunil Byrisetty1 min read
అప్ అండ్ డౌన్ బుక్ చేస్తే.. భలే డిస్కౌంట్!
రైల్వే ప్రయాణికులకు ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బంపరాఫర్ అందించారు. ప్రయాణికులు అప్ అండ్ డౌన్ టిక్కెట్లు ఒకేసారి బుక్ చేసుకుంటే చక్కటి డిస్కౌంట్ లభించనుంది. “రౌండ్ ట్రిప్ ప్యాక
రైల్వే ప్రయాణికులకు ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బంపరాఫర్ అందించారు. ప్రయాణికులు అప్ అండ్ డౌన్ టిక్కెట్లు ఒకేసారి బుక్ చేసుకుంటే చక్కటి డిస్కౌంట్ లభించనుంది. “రౌండ్ ట్రిప్ ప్యాకేజీ” పేరుతో రైల్వే మంత్రిత్వ శాఖ టిక్కెట్ల కోసం రద్దీని నివారించడానికి కొత్త పథకాన్ని ప్రారంభించింది. రెండు ట్రిప్పులకు తక్కువ ధరలకు టిక్కెట్లు ఇవ్వడం ద్వారా వేర్వేరు రోజులలో జనాన్ని విభజించడం ఈ పథకం లక్ష్యంగా చెబుతోంది. ప్రయాణికుడు రానుపోను టిక్కెట్లను కలిపి బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణానికి సంబంధించిన ప్రాథమిక ఛార్జీపై 20% తగ్గింపు ఉంటుంది. ఒకే పేరు, వివరాలతో రిటర్న్, యు రిటర్న్ టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. రెండు టిక్కెట్లు ఒకే తరగతి, ఒకే స్టేషన్ జత (OD పెయిర్) అయి ఉండాలి. ఉదాహరణకు టికెట్ ధర రూ.1000 అయితే డిస్కౌంట్ కింద రూ.800 చెల్లిస్తే సరిపోతుంది.