News14th Jul 08:34 AMSunil Byrisetty1 min read

రైల్వేశాఖ కీలక నిర్ణయం.. సీసీ కెమెరాల ఏర్పాటు!

రైళ్లలో ప్రయాణించే వారి భద్రతే లక్ష్యంగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రైలు బోగీల వద్ద కెమెరాలు అమర్చాలని నిర్ణయం తీసుకుంది. రైళ్లలో జరుగుతున్న చోరీలు, అసాంఘిక కార్యక

రైల్వేశాఖ కీలక నిర్ణయం.. సీసీ కెమెరాల ఏర్పాటు!
రైళ్లలో ప్రయాణించే వారి భద్రతే లక్ష్యంగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రైలు బోగీల వద్ద కెమెరాలు అమర్చాలని నిర్ణయం తీసుకుంది. రైళ్లలో జరుగుతున్న చోరీలు, అసాంఘిక కార్యకలాపాలు, దాడులను కట్టడి చేసేలా ఈ నిర్ణయం ఉండనుందని చెబుతున్నారు. ప్రయాణికుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అరాచకాలకు పాల్పడుతున్న దుండగుల ముఠాల సంగతి తేల్చడం సీసీటీవీ కెమెరాతో సాధ్యం కానుంది. ఇటీవల నార్తరన్‌ రైల్వే పరిధిలో రైల్వే కోచ్‌లకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటును ప్రయోగాత్మకంగా చేపట్టారు. అక్కడ విజయవంతమవడంతో దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 74 వేల కోచ్‌లు, 15 వేల లోకో కోచ్‌లు ఉన్నాయి. వీటన్నింటికీ సీసీకెమెరాల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.
IRCTC
Indian Railways
Ashwini Vaishnaw
Ravneet Singh Bittu
CCTV cameras
passenger safety
railway security
AI Mission
railway coaches
locomotive engines
crime prevention
Scroll for the next article