International27th Jul 10:59 AMSunil Byrisetty1 min read

30న నింగిలోకి నిసార్

భారత ఇస్రో, అమెరికా నాసా సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహం జూలై 30న నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ శాటిలైట్ భూమి అణువణువును 12 రోజులకోసారి స్కాన్ చేసేస్తుంది. అడవులు, మైదా నాలు, క

30న నింగిలోకి నిసార్
భారత ఇస్రో, అమెరికా నాసా సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహం జూలై 30న నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ శాటిలైట్ భూమి అణువణువును 12 రోజులకోసారి స్కాన్ చేసేస్తుంది. అడవులు, మైదా నాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జల వనరులు, మంచు ప్రాంతాలు.. ఇలా అన్నింటినీ జల్లెడ పడుతుంది. భూమి పొరల్లో ఒక్క అంగుళం మార్పు వచ్చినా గుర్తించేస్తుంది. కొండచరియలు విరిగిపడటాన్ని, భూకంపాలను, అగ్నిపర్వతాలు బద్దలవ డాన్ని ముందే గుర్తించేందుకు అవకాశం ఇస్తుంది. ఇది అమెరికా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థలు నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన 'నిసార్ (నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్)' ఉపగ్రహం ప్రత్యేకత ఇది. ఒక ట్రక్కు పరిమాణంలో, 2,393 కిలోల బరువున్న నిసార్ ఉపగ్రహాన్ని ఈ నెల 30న సాయంత్రం 5.40 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్16 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ ఉపగ్రహం భూమికి 743 కిలోమీటర్ల ఎత్తున సూర్యానువర్తన కక్ష్యలో పరిభ్రమిస్తూ పరిశీలిస్తుంది. ప్రాజెక్టుకు మొత్తం రూ.11,200 కోట్లు (1.3 బిలియన్ డాలర్లు) వ్యయం అవుతోంది.
NISAR
ISRO
NASA
Nisar launch
Earth Observation
Space Mission
Srihari kota
GSLVF16
Earth Monitoring
Satellite Launch
Indian Space Program
US India Space Collaboration
Scroll for the next article