Sports22nd Jan 02:58 PMSunil Byrisetty1 min read

భారత షట్లర్ పీవీ సింధు అరుదైన రికార్డు!

భారత షట్లర్ పీవీ సింధు అరుదైన రికార్డు సాధించింది. అంతర్జాతీయ కెరీర్‌లో పీవీ సింధుకు 500వ విజయం దక్కింది. ఇండోనేషియా మాస్టర్స్‌లో గెలిచి పీవీ సింధు ఈ ఘనత సొంతం చేసుకుంది. డెన్మార్క

భారత షట్లర్ పీవీ సింధు అరుదైన రికార్డు!
భారత షట్లర్ పీవీ సింధు అరుదైన రికార్డు సాధించింది. అంతర్జాతీయ కెరీర్‌లో పీవీ సింధుకు 500వ విజయం దక్కింది. ఇండోనేషియా మాస్టర్స్‌లో గెలిచి పీవీ సింధు ఈ ఘనత సొంతం చేసుకుంది. డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ హోజ్ మార్క్‌ను వరుస సెట్లలో ఓడించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ చరిత్రలో ఇప్పటివరకు ఐదుగురికే ఈ రికార్డు ఉంది. తాజాగా ఆరో షట్లర్‌గా, తొలి భారతీయురాలిగా పీవీ సింధు నిలిచింది. పీవీ సింధు 500వ అంతర్జాతీయ విజయంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు. దేశ క్రీడాకారులందరికీ పీవీ సింధు విజయం ఆదర్శమని కొనియాడారు.
Indian sports
PV Sindhu
Badminton
500th International Victory
Indonesia Masters
మహిళల సింగిల్స్
అరుదైన రికార్డు
క్రీడా
Scroll for the next article