Business Type30th Oct 06:16 PMSunil Byrisetty1 min read
స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని స్వల్ప లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన పరిస్థితులు, అమెరికా టెక్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మన మార్కెట్లపైనా ప్రభావం చూ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని స్వల్ప లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన పరిస్థితులు, అమెరికా టెక్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మన మార్కెట్లపైనా ప్రభావం చూపాయి. దీంతో రోజంతా సూచీల్లో ఒడిదుడుకులు కనిపించాయి. శుక్రవారం ఉదయం మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ.. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఆరంభంలో వచ్చిన లాభాల్లో కొంత భాగం తగ్గిపోయింది. అయినప్పటికీ చివరి వరకు కొనుగోళ్ల మద్దతు కొనసాగడంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లోనే ముగిశాయి. శుక్రవారం ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 74,199 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ప్రారంభంలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీ క్రమంగా పుంజుకుంది. ఒక దశలో 74,742 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే ఆ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీ కొంత వెనక్కి తగ్గింది. చివరకు 308 పాయింట్ల లాభంతో 74,466 పాయింట్ల వద్ద స్థిరపడింది.