International9th Oct 04:28 PMSunil Byrisetty1 min read
భారత సంతతి నవనీతం నావి పిళ్లైకు నోబెల్
భారత సంతతి మహిళకు 2026 నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఈ యేటి నోబెల్ శాంతి బహుమతిని నవనీతం నావిపిళ్లై గెలుచుకున్నారు. ఓస్లోలోని నార్వేయన్ నోబెల్ కమిటీ ఈ అవార్డును ప్రక
భారత సంతతి మహిళకు 2026 నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఈ యేటి నోబెల్ శాంతి బహుమతిని నవనీతం నావిపిళ్లై గెలుచుకున్నారు. ఓస్లోలోని నార్వేయన్ నోబెల్ కమిటీ ఈ అవార్డును ప్రకటించింది. శాంతి, అంతర్జాతీయ న్యాయ స్థాపన కోసం ఆమె తీవ్రంగా కృషి చేసినట్లు నోబెల్ కమిటీ తన ప్రకటనలో పేర్కొన్నది. ఒక ప్రకటనలో, నార్వేజియన్ నోబెల్ కమిటీ, పిళ్ళై ప్రభుత్వాలను, జాతీయ నాయకులను జవాబుదారీగా ఉంచారని, “హింస, సంఘర్షణల బాధితులకు ఆశను” కలిగించారని పేర్కొంది. చట్టబద్ధమైన పాలనను పాటించాల్సిన బాధ్యత వ్యక్తులు, ప్రభుత్వాలపై ఉందని పిళ్ళై ఎల్లప్పుడూ నొక్కిచెప్పారని అది తెలిపింది. కాగా.. భారతీయ మూలాలున్న నోబెల్ బహుమతి గ్రహీతల జాబితాలో పిళ్ళై చేరారు. ఆమెకు ముందు, విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయ మూలాలున్న పలువురు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. వీరిలో హర్ గోవింద్ ఖొరానా (1968, వైద్యశాస్త్రం), సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ (1983, భౌతికశాస్త్రం), వెంకట్రామన్ ‘వెంకీ’ రామకృష్ణన్ (2009, రసాయనశాస్త్రం), వి.ఎస్. నైపాల్ (2001, సాహిత్యం), అభిజిత్ బెనర్జీ (2019, ఆర్థిక శాస్త్రం) వంటి వారు ఉన్నారు. ఇక, ఇప్పటివరకు నోబెల్ బహుమతిని పొందిన భారతీయ పౌరుల విషయానికొస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ (1913, సాహిత్యం), సర్ సి.వి. రామన్ (1930, భౌతికశాస్త్రం), మదర్ థెరిసా (1979, శాంతి), అమర్త్య సేన్ (1998, ఆర్థిక శాస్త్రం), కైలాష్ సత్యార్థి (2014, శాంతి) ఉన్నారు.