National1st Oct 10:21 AMSunil Byrisetty1 min read

ఇండియన్ రియల్ హీరో.. ప్రపంచం సెల్యూట్

ఇండియన్ రియల్ హీరో స్మిత్ మచ్చార్ కు ప్రపంచం సెల్యూట్ చేసింది. అతడి అసమాన ధైర్య సాహసాలకు పలు దేశాలు జేజేలు కొట్టాయి. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్లోని టెల్ అవీవు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమా

ఇండియన్ రియల్ హీరో.. ప్రపంచం సెల్యూట్
ఇండియన్ రియల్ హీరో స్మిత్ మచ్చార్ కు ప్రపంచం సెల్యూట్ చేసింది. అతడి అసమాన ధైర్య సాహసాలకు పలు దేశాలు జేజేలు కొట్టాయి. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్లోని టెల్ అవీవు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో ఊహించని ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగానే కో-పైలట్ కత్తితో దాడి చేయడంతో భారత సంతతి కెప్టెన్ స్మిత్ మచ్చార్ తీవ్ర గాయాలపాలయ్యారు. రక్తమోడుతున్నా వెరవకుండా కాక్పిట్ తలుపు తెరిచి, పెను ప్రమాదాన్ని నివారించారు. 174 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. బోయింగ్ 737 మ్యాక్స్-8 విమానం గాల్లో ఉండగా, ఒమన్ జాతీయుడిగా భావిస్తున్న కో పైలట్ అకస్మాత్తుగా కెప్టెన్ స్మిత్ మచ్చార్పై కత్తితో దాడి చేశాడు. విమాన నియంత్రణ వ్యవస్థలను ధ్వంసం చేసి, విమానాన్ని కూల్చేందుకు అతను తీవ్రంగా ప్రయత్నించాడు. ఆ పెనుగులాటలో విమానం 30 సెకన్లలో 14,000 అడుగుల కిందికి దూసుకువచ్చింది. తీవ్ర గాయాలపాలై కిందపడిపోతున్న సమయంలో కూడా కెప్టెన్ స్మిత్ చాకచక్యంగా విమానాన్ని అదుపు చేశారు. కెప్టెన్ స్మిత్ మచ్చార్ ప్రదర్శించిన అద్భుత ధైర్యాన్ని ప్రపంచ నేతలు నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రశంసించారు.
Scroll for the next article