Crime7th Nov 04:08 PMSunil Byrisetty1 min read
మయన్మార్‌లో భారీ సైబర్ స్కామ్‌లో చిక్కుకున్న భారతీయులు
మయన్మార్‌లో భారీ సైబర్ స్కామ్‌లో పలువురు భారతీయులు చిక్కుకున్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం మయన్మార్ వెళ్లి అక్కడి సంస్థలు చేసిన మోసాల కారణంగా సైబర్ స్కామ్‌లో వందలాది మంది భారతీయులు ఇ
మయన్మార్‌లో భారీ సైబర్ స్కామ్‌లో పలువురు భారతీయులు చిక్కుకున్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం మయన్మార్ వెళ్లి అక్కడి సంస్థలు చేసిన మోసాల కారణంగా సైబర్ స్కామ్‌లో వందలాది మంది భారతీయులు ఇరుక్కున్నారు. వారి కుటుంబ సభ్యుల వినతుల మేరకు కేంద్ర ప్రభుత్వం స్వదేశీయులను భారత్‌కు తీసుకొస్తోంది. విడతల వారీగా ప్రత్యేక విమానాల్లో భారత్‌కు తరలిస్తోంది. బాధితుల్లో ఏపీ, తెలంగాణకు చెందిన పలువురున్నట్లు సమాచారం. ఏపీ, తెలంగాణకు చెందిన వారిని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవన్ అధికారులు స్వస్థలాలకు తరలిస్తున్నారు.