News1st Aug 04:06 PMSunil Byrisetty1 min read

ఎయిర్‌పోర్టులు రెట్టింపు దాటాయన్న మోదీ

దేశంలో బీజేపీ ప్రభుత్వం రావడానికి ముందు, ఇప్పుడు పోలిస్తే ఎయిర్ పోర్టులు డబుల్ కన్నా ఎక్కువ ఉన్నాయని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. 2014కు ముందు దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే

ఎయిర్‌పోర్టులు రెట్టింపు దాటాయన్న మోదీ
దేశంలో బీజేపీ ప్రభుత్వం రావడానికి ముందు, ఇప్పుడు పోలిస్తే ఎయిర్ పోర్టులు డబుల్ కన్నా ఎక్కువ ఉన్నాయని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. 2014కు ముందు దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవన్నారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో అనేక విమానాశ్రయాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. ఇప్పుడు ఆ సంఖ్య 166కు పెరిగిందని ప్రధాని మోదీ తెలిపారు. చిన్న పట్టణాల నుంచి నగరాలకు విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఉడాన్ పథకం వల్ల విమానాశ్రయాల సంఖ్యతో పాటు ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. కాశీలో ప్రారంభమైన స్పోక్ ఎయిర్‌పోర్ట్ మోడల్ అమృత్‌సర్‌ వరకు విస్తరించిందని, బ్లూ ఎకానమీని బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
Indian airports
PM Narendra Modi
Airport Infrastructure
Aviation
Civil Aviation
UDAN Scheme
Airport Development
BJP Government
మౌలిక వసతులు
అభివృద్ధి
ఏవియేషన్
భారత అభివృద్ధి
అమృత్‌సర్
కాశీ
Scroll for the next article