News7th Nov 12:54 PMSunil Byrisetty1 min read
ఆగస్టులో తొలి బుల్లెట్ రైలు పరుగు
బుల్లెట్ రైలు పరుగుకు దేశం సిద్ధమవుతోంది. దేశంలో తొలి బుల్లెట్ రైలు తయారీ శరవేగంగా జరుగుతోంది. అహ్మదాబాద్-ముంబై హైస్పీడ్ కారిడార్‌లో వచ్చే ఏడాది ఆగస్ట్ 15వ తేదీన తొలి రైలు పరుగులు త
బుల్లెట్ రైలు పరుగుకు దేశం సిద్ధమవుతోంది. దేశంలో తొలి బుల్లెట్ రైలు తయారీ శరవేగంగా జరుగుతోంది. అహ్మదాబాద్-ముంబై హైస్పీడ్ కారిడార్‌లో వచ్చే ఏడాది ఆగస్ట్ 15వ తేదీన తొలి రైలు పరుగులు తీయనుంది. బెంగళూరులోని BEML కేంద్రంలో తయారవుతున్న ఈ రైలులో 8 కోచ్‌లు, 557 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంటాయి. గంటకు 280 కిమీ వేగంతో వెళ్లే ఈ రైలులో అత్యాధునిక ఎస్ఈడీ స్క్రీన్లు, వైఫై, ఎర్గోనామిక్ సీట్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. దేశీయ సాంకేతికతతో రూపొందుతున్న ఈ బుల్లెట్ రైలు, అవసరమైతే భవిష్యత్తులో 18 కోచ్‌లకు విస్తరించే అవకాశం ఉంది.