News20th Nov 10:30 AMSunil Byrisetty1 min read
మరో రెండేళ్లలో బుల్లెట్ రైలు పరుగులు
ప్రపంచంలోని పలు దేశాల్లో బుల్లెట్ రైళ్లు పరుగులు తీస్తుండగా.. మన దేశంలో మాత్రం మరో రెండేళ్ల తర్వాత పట్టాలు ఎక్కనున్నాయి. దేశంలో 2027 ఆగస్టులో తొలి బుల్లెట్ రైలు ప్రారంభమవుతుందని రై
ప్రపంచంలోని పలు దేశాల్లో బుల్లెట్ రైళ్లు పరుగులు తీస్తుండగా.. మన దేశంలో మాత్రం మరో రెండేళ్ల తర్వాత పట్టాలు ఎక్కనున్నాయి.
దేశంలో 2027 ఆగస్టులో తొలి బుల్లెట్ రైలు ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తొలి దశలో గుజరాత్లోని సూరత్, వాపి మధ్య 100 కి.మీ. మేర నడపనున్నట్లు చెప్పారు. మొత్తం ప్రాజెక్టు 2029లో పూర్తవుతుందని అన్నారు. ముంబై-అహ్మదాబాద్ కారిడార్ అందుబాటులోకి వస్తే 2 గంటల్లోనే జర్నీ పూర్తి అవుతుందని అన్నారు. ఇటీవల ప్రధాని పర్యటన తర్వాత అశ్వినీ వైష్ణవ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.